ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు, 17 మంది మృతి..!
ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,024మందికి కరోనా పరీక్షలు చేయగా, 2,974 కొత్త కేసులు బయటపడ్డాయి.;
AP Corona Cases
Ap corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,024మందికి కరోనా పరీక్షలు చేయగా, 2,974 కొత్త కేసులు బయటపడ్డాయి. కరోనా మహమ్మారికి మరో 17 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి కొత్తగా 3,290 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 24,708 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కారణంగా ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ ని విడుదల చేసింది.