IIIT Nuzvid: హాస్టల్‌పై నుండి దూకిన విద్యార్థిని.. నాలుగు గంటలు గుర్తించని సెక్యూరిటీ..
IIIT Nuzvid: ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హారిక హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది;
IIIT Nuzvid: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో.. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హారిక హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్రగాయాతో నాలుగు గంటల పాటు రోడ్డుపై పడి ఉన్నా విద్యార్థినిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. బాధితురాలిని చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. అయితే హారిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.