AP Corona Cases : ఏపీలో కొత్తగా 4,147 కరోనా కేసులు
AP Corona Cases : ఏపీలో కొత్తగా 4వేల 147 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ 38 మంది చనిపోయారు.;
AP Corona Cases : ఏపీలో కొత్తగా 4వేల 147 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ 38 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18లక్షల 75వేల 622కి చేరింది. కొవిడ్‌తో 12వేల 566 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 46వేల 126 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో.. ఏడుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, కడప, విశాఖలో ఇద్దరు చొప్పున, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు.