AP Corona Cases : ఏపీలో కొత్తగా 4,250 కేసులు, 33 మరణాలు
AP Corona Cases : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 250 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్‌తో 33 మంది మరణించారు.;
AP Corona Cases : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 250 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్‌తో 33 మంది మరణించారు.అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 890 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 673, ప్రకాశంలో 461, పశ్చిమగోదావరి జిల్లాలో 417 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18 లక్షల 79 వేలకు చేరగా.. వైరస్‌తో 12వేల 599 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 5 వేల 570 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44వేల 773 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది.