నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా 12 కిలోమీటర్లు మట్టికట్టతో నిర్మించిన కండలేరు. జలాశయం నీటి సామర్థ్యం 68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.. రాపూరు మండలం రేగడపల్లి గ్రామంకి 10 సంవత్సరాల క్రితం కండలేరు జలాశయంలో 55 టిఎంసిలు నీరు నిలువ చేయగా రేగడపల్లి గ్రామం చుట్టూ నీరు చేరడంతో తెలుగు గంగ అధికారులు స్పందించి ముంపు గ్రామంగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. 10 సంవత్సరాలు క్రితం నష్టపరిహారం చెల్లించిన ఇంటి స్థలాలు వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పొదలకూరు మండలం చాటకుట్ల సమీపంలో కొంత పొలాన్ని చూపించి రిహాబిలేషన్స్ సెంటర్ ఇల్లు నిర్మిస్తామని అధికారులు చెప్పారు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి పట్టాలు కానీ ఇంటి స్థలాలు కానీ మంజూరు కాలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి రేగడపల్లి గ్రామస్తుల కు ఇంటి పట్టాలు ఇల్లు మంజూరు చేయాలని అధికారులను కోరుకుంటున్నారు...