Jc Diwakar Reddy: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు!

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన, పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పెద్దపప్పురు పోలీసులు తెలిపారు.

Update: 2021-01-05 09:21 GMT

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన, పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పెద్దపప్పురు పోలీసులు తెలిపారు. పెద్దపప్పురు మండలం జుటూరులోని వ్యవసాయ తోటలో జేసీ ప్రభాకర్‌, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై పోలీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశామని తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. తాడిపత్రిలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతుందని, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుదని చెప్పారు.

Tags:    

Similar News