దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఐదు నెలలుగా జైలులో వుంటున్న నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు పది వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియమ్మ కేసు సంచలనం సృష్టించింది. 2020లో తుళ్లూరు మండలానికి చెందిన దళిత మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు రావాల్సిన పెన్షన్‌ను నిలిపివేయడంతో పాటు, ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరియమ్మ దూషించింది. దాంతో మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను సురేష్ అనుచరులు హతమార్చారు.