ACCIDENT: లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి!

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Update: 2025-12-12 03:15 GMT

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. భద్రాచలం నుంచి అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చంద్రబాబు దిగ్ర్భాంతి

అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఉన్నాతాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా ప్రమాదానికి గురైన బస్సు విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన AP39UM6543గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు.

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు విశాఖకు పర్యటించనున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి పలు ఐటీ కంపెనీలకు సీఎం, మంత్రి నారా లేకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ నిర్మాణానికి 21.31 ఎకరాలను కేటాయించారు. 3 దశల్లో రూ.1,583 కోట్లతో ఈ కంపెనీని నిర్మించనున్నారు. అనంతరం విశాఖలో జరగనున్న ఎకనామిక్ రీజియన్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

Tags:    

Similar News