YSRCP Leaders : ఆ ముగ్గురి చుట్టే కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిటీలో తేలుతుందా..?

Update: 2026-02-05 05:11 GMT

ముగ్గురు చుట్టే కల్తీ నెయ్యి కేసు వివాదం తిరుగుతుందా అంటే అవుననే అంటున్నారు కూటమినేతలు. ఏపీ కేబినెట్ కు సిట్ రాసిన లేఖలో ముగ్గురు పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందులో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు కూడా వైసిపి హయాంలో టీటీడీలో ఉన్నత పదవులు తీసుకున్నవారే. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ కొనుగోళ్ల కమిటీలో మెంబర్లుగా ఉన్నట్లు సిట్ పేర్కొంది. వీరిద్దరూ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి కమిటీలో మెంబర్లుగా చేరారని.. కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించినట్టు అనుమానం వ్యక్తం చేసింది. వాస్తవానికి చిన్న అప్పన్న ఎవరి అండ లేకుండా అంత పెద్ద స్కాం చేశాడు అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన కేవలం ఒక పిఏ మాత్రమే. ఆయనకు టీటీడీలో అత్యున్నత అధికారాలు ఏవీ లేవు కదా.

వైవీ సుబ్బారెడ్డి అండలేకుండా చిన్న అప్పన్న ఇదంతా చేశాడు అంటే అనుమానాలకు తావిస్తున్న వ్యవహారమే. కాబట్టి కేబినెట్ కూడా ఈ కేసులో అసలు సూత్రధారులను బయటపెట్టేందుకు విచారణ కమిటీకి ఆదేశించింది. ఈ కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు తారుమారు అయ్యాయని.. అయితే అవి ఎక్కడికి వెళ్లాయి అనే దగ్గరే అనుమానాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు విచారణ కమిటీ ఆ బదిలీ అయిన నగదు వ్యవహారాలను తెలిస్తే ఈ కేసులో అంతిమ లబ్ధిదారులు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు సిట్ అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా విచారణ కమిటీ మరింత లోతుల్లోకి వెళ్లి.. ఈ కేసుతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళ లిస్టును బయటపెట్టే ఛాన్స్ ఉంది. అందుకే భూమన కరుణాకర్ రెడ్డి ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి విచారణ కమిటీ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా తప్పు చేయకపోతే ఆయన ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది. ఇంకా ఎన్ని విచారణలు అయినా చేయండి అని చెప్పొచ్చు కదా. అలా చేయకుండా విచారణ ఇంతటితో ఆపేయండి అంటూ వైసీపీ నేతలు చెప్పడం వాళ్ళ తీరును అద్దం పడుతుంది.

Tags:    

Similar News