భార్య కోసం ఓ భర్త తనువు చాలించాడు. మద్యం మత్తు ఆ కాపురాన్ని చిద్రం చేసింది. మద్యానికి బానిసైన భర్త తనకు వద్దని భార్య వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు...ఈ విషాద ఘటన ఏపీ లోని అన్నమయ్య జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే గాలివీడు మండలం అరవీడుకు చెందిన గోపాల్ (37) మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. భర్త చేత మద్యం మాన్పించి మంచిగా మార్చుకోవాలని చూసిన భార్యకు నిరాశే ఎదురైంది. భార్య చెప్పిన మంచి మాటలు వినకపోగా తనను తీవ్రంగా వేధించేవాడు గోపాల్. దీంతో ఆవేదన చెందిన రమణమ్మ మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త గోపాల్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక తన భార్య తిరిగి కాపురానికి రాదేమోనని భయపడ్డ గోపాల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.