'పుష్ప' బెనిఫిట్ షో వేయలేదంటూ హిందూపురంలో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.;
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలాజీ థియేటర్‌లో పుష్ప సినిమా బెనిఫిట్ షో వేయలేదంటూ అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన చేపట్టారు. బాలాజీ, లక్ష్మీ థియేటర్లలో పుష్ప రిలీజ్ సందర్భంగా తెల్లవారుజామునే భారీగా తరలివచ్చారు. అయితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెనిఫిట్ షో వేయడం లేదని బాలాజీ థియేటర్ నిర్వాహకులు తెలిపారు. అభిమానులు ఆందోళన చేయడంతో పాటు రాళ్లేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.