AMARAVATHI: ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో అమరావతి
మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూ సమీకరణపై రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైంది. ఆ బిల్లులు చెల్లించి మళ్లీ రాజధాని పనులు ప్రారంభించే సమయానికి వర్షాలు ముంచెత్తాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని వెల్లడించారు. రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే రైతులు భూములిచ్చేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చేందుకు తామంతా సిద్దంగా ఉన్నామని అమరావతి మండలంలోని గ్రామాల రైతులు మంత్రి నారాయణకు స్పష్టం చేసారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం రైతులను సన్నద్దం చేసేందుకు అమరావతి మండలంలోని ఎండ్రాయిలో మంత్రి నారాయ పర్యటించారు. ఉదయం గ్రామానికి చేరుకున్న మంత్రి నారాయణకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో పాటు రైతులు ఘనంగా స్వాగతం పలికారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెండో విడత భూ సమీకరణలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లోని 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. గతంలో భూ సమీకరణ సమయంలో రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తాం. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాం అని తెలిపారు.