AMARAVATHI: అమరావతికి అధికారికంగా రాజ ముద్ర

వేగంగా అమరావతికి చటబద్ద ప్రక్రియ... విభజన చట్టంలోని  5(2)కి సవరణ... చక్రం తిప్పుతున్న కూటమి సర్కార్

Update: 2025-12-05 04:30 GMT

అమ­రా­వ­తి రా­జ­ధా­ని వి­ష­యం­లో కీలక పరి­ణా­మం­చో­టు చే­సు­కుం­ది. అమ­రా­వ­తి చట్ట­బ­ద్దత అం­శం­లో కద­లిక వచ్చిం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ పు­న­ర్వ్య­వ­స్థీ­క­రణ చట్టం­లో­ని సె­క్ష­న్ 5(2)లో సవరణ ద్వా­రా అమ­రా­వ­తి­ని స్ప­ష్టం­గా రా­జ­ధా­ని­గా చే­ర్చేం­దు­కు కేం­ద్రం ప్ర­య­త్ని­స్తోం­ది. ఈ మే­ర­కు బి­ల్లు­ను సి­ద్ధం చే­స్తోం­ది. ఈ అం­శం­పై ఇప్ప­టి­కే న్యా­య­శాఖ ఆమో­దం తె­లి­పిం­ది. దీం­తో ఈ పా­ర్ల­మెం­ట్ శీ­తా­కాల సమా­వే­శం­లో­నే బి­ల్లు­ను ప్ర­వే­శ­పె­ట్టి­ఆ­మో­దిం­ప­జే­సే అవ­కా­శం ఉంది. అనం­త­రం అమ­రా­వ­తి­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా ప్ర­క­టి­స్తూ గె­జి­ట్ నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­సేం­దు­కు కేం­ద్ర శర­వే­గం­గా ప్ర­య­త్నా­లు చే­స్తోం­ది. .ఆం­ధ్ర­ప్ర­దే­శ్ పు­న­ర్వ్య­వ­స్థీ­క­రణ చట్టం­లో­ని సె­క్ష­న్ 5(2)లో సవరణ ద్వా­రా అమ­రా­వ­తి­ని స్ప­ష్టం­గా రా­జ­ధా­ని­గా చే­ర్చేం­దు­కు కేం­ద్రం ప్ర­య­త్ని­స్తోం­ది. ఈ ని­ర్ణ­యా­ని­కి ఇప్ప­టి­కే కేం­ద్ర న్యాయ శాఖ ఆమో­దం తె­లి­పిం­ది. త్వ­ర­లో­నే కే­బి­నె­ట్ దృ­ష్టి­కి సైతం ఈ చట్ట­బ­ద్దత బి­ల్లు వె­ళ్ల­నుం­ది. ఆ తర్వాత దా­ని­ని పా­ర్ల­మెం­ట్‌­లో ప్ర­వే­శ­పె­ట్టేం­దు­కు కేం­ద్ర ప్ర­భు­త్వం ప్ర­య­త్నా­లు ము­మ్మ­రం చే­సిం­ది. పా­ర్ల­మెం­ట్ ఆమో­దం పొం­దిన తర్వాత ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర­రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­ని ప్ర­క­టి­స్తూ గె­జి­ట్ వి­డు­దల చేసే అవ­కా­శం ఉంది.గత కొ­న్నా­ళ్లు­గా అమ­రా­వ­తి రా­జ­ధా­ని­కి చట్ట బద్ధత కల్పిం­చా­ల­ని ఏపీ­లో డి­మాం­డ్ నె­ల­కొం­ది. ఈ పరి­ణా­మాల నే­ప­థ్యం­లో కేం­ద్ర ప్ర­భు­త్వం ఈ పా­ర్ల­మెం­ట్ శీ­తా­కాల సమా­వే­శా­ల్లో­నే బి­ల్లు­ను ప్ర­వే­శ­పె­ట్టి ఆమో­దిం­ప­జే­యా­ల­ని యో­చి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది.

రాష్ట్ర విభజన చట్టంలో ఏముంది?

పార్ట్‌-2 కింద 5(1): **నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుంది.

పార్ట్‌-2 కింద 5(2): **సబ్‌ సెక్షన్‌ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. 

మూడు రాజధానులన్న వైసీపీ ప్రభుత్వం

2019అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో వై­సీ­పీ అఖండ వి­జ­యం సా­ధిం­చిం­ది.151 స్థా­నా­ల్లో గె­లు­పొం­ది వై­ఎ­స్ జగన్ ము­ఖ్య­మం­త్రి పీ­ఠా­న్ని అధి­రో­హిం­చా­రు. అనం­త­రం ఏపీ­కి మూడు రా­జ­ధా­ను­లు ప్ర­క­టిం­చా­రు. దీం­తో అమ­రా­వ­తి రా­జ­ధా­ని­పై నీ­లి­మ­బ్బు­లు కమ్ము­కు­న్నా­యి. అమ­రా­వ­తి­ని శాసన రా­జ­ధా­ని­గా...కర్నూ­లు­ను యరా­జ­ధా­ని­గా...వి­శా­ఖ­ప­ట్నం­ను పా­ల­నా రా­జ­ధా­ని­గా వై­సీ­పీ ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ది. అయి­తే ఏపీ­కి అమ­రా­వ­తి­యే ఏకైక రా­జ­ధా­ని­గా ఉం­డా­లం­టూ రై­తు­లు ఉద్య­మిం­చా­రు. సం­వ­త్స­రాల తర­బ­డి ని­ర­స­న­లు చే­ప­ట్టా­రు. కొం­త­మం­ది ప్రా­ణా­లు సైతం కో­ల్పో­యా­రు. అమ­రా­వ­తి టు తి­రు­ప­తి వరకు పా­ద­యా­త్ర సైతం చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. ఈ పా­ద­యా­త్ర­లో ఉద్రి­క్తత పరి­స్థి­తు­లు సైతం చోటు చే­సు­కు­న్నా­యి. అం­తే­కా­దు అమ­రా­వ­తి రై­తుల ఉద్య­మం­లో ఎం­తో­మం­ది అరె­స్టు­లు సైతం అయిన సం­గ­తి తె­లి­సిం­దే. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­ధా­ని­గా అమ­రా­వ­తి­ని ప్ర­క­టి­స్తూ గె­జి­ట్ నో­టి­ఫి­కే­ష­న్ ఇవ్వా­లం­టే పు­న­ర్వి­భ­జన చట్టం 2014ను సవ­రిం­చా­ల్సి ఉం­టుం­ది. తె­లం­గా­ణ­ రా­జ­ధా­ని­గా హై­ద­రా­బా­ద్‌­ను పొం­దు­ప­రి­చా­రే తప్ప ఏపీ­కి రా­జ­ధా­ని అమ­రా­వ­తి అని చూ­ప­లే­దు. ఏపీ పు­న­ర్వి­భ­జన చట్టం 2014ను సవ­రిం­చా­ల్సి ఉం­టుం­ది.

Tags:    

Similar News