AMARAVATHI: అమరావతిలో అమరజీవి స్మృతివనం

58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం... ఆయన త్యాగం గుర్తుండేలా విగ్రహ ఏర్పాటు

Update: 2025-12-16 02:30 GMT

భా­వి­త­రా­ల­కు గు­ర్తుం­డి­పో­యే­లా అమ­ర­జీ­వి పొ­ట్టి­శ్రీ­రా­ము­లు స్మృ­తి వనా­న్ని అమ­రా­వ­తి­లో ని­ర్మి­స్తు­న్నా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు స్ప­ష్టం చే­శా­రు. తె­లు­గు వారి ఆత్మ­గౌ­ర­వం కోసం ఆయన పో­రా­డిన 58 రో­జు­ల­కు గు­ర్తు­గా రా­జ­ధా­ని­లో 58 అడు­గుల ఆయన వి­గ్ర­హం ఏర్పా­టు చే­స్తు­న్న­ట్టు ప్ర­క­టిం­చా­రు. వి­జ­య­వాడ తు­మ్మ­ల­ప­ల్లి కళా­క్షే­త్రం­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం అధి­కా­రి­కం­గా ని­ర్వ­హిం­చిన అమ­ర­జీ­వి పొ­ట్టి­శ్రీ­రా­ము­లు ఆత్మా­ర్పణ దినం కా­ర్య­క్ర­మా­ని­కి సీఎం ము­ఖ్య అతి­థి­గా హా­జ­ర­య్యా­రు. అమ­ర­జీ­వి వి­గ్ర­హా­ని­కి పూ­ల­మాల వేసి ఘనం­గా ని­వా­ళు­లు అర్పిం­చా­రు. అనం­త­రం పొ­ట్టి­శ్రీ­రా­ము­లు కు­టుంబ సభ్యు­ల­ను సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు సత్క­రిం­చా­రు. నమ్మిన సి­ద్ధాం­తం కోసం ప్రాణ త్యా­గం చే­సిన అమ­ర­జీ­వి తె­లు­గు ప్ర­జల ఆస్తి అని అన్నా­రు. తె­లు­గు ప్ర­జల ప్ర­త్యేక రా­ష్ట్రం కలను ప్రా­ణా­లు తృ­ణ­ప్రా­యం­గా అర్పిం­చి 58 రో­జు­ల్లో­నే సా­కా­రం చే­సిన త్యా­గ­ధ­ను­డు పొ­ట్టి శ్రీ­రా­ము­ల­ని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు కీ­ర్తిం­చా­రు.

‘పొ­ట్టి శ్రీ­రా­ము­లు­కు తొ­లుత గు­ర్తిం­పు­ని­చ్చిన పా­ర్టీ తె­దే­పా. మన నా­య­కు­డు ఎన్టీ­ఆ­ర్‌ 1985లో తె­లు­గు వి­శ్వ­వి­ద్యా­ల­యా­ని­కి ఆయన పేరు పె­ట్టా­రు. ఆయన పు­ట్టిన నె­ల్లూ­రు జి­ల్లా­కు శ్రీ­పొ­ట్టి శ్రీ­రా­ము­లు పే­రు­ను నా­మి­నే­ట్‌ చే­స్తూ 2003 మా­ర్చి 10న కేం­ద్రా­ని­కి పంపా. 2008లో దా­న్ని కేం­ద్రం నో­టి­ఫై చే­సిం­ది’ అని సీఎం గు­ర్తు­చే­శా­రు. ‘నె­ల్లూ­రు జి­ల్లా­లో శ్రీ­రా­ము­లు పు­ట్టిన ఇం­టి­ని మె­మో­రి­య­ల్‌­గా మా­ర్చి, అక్కడ వి­గ్ర­హా­న్ని ప్ర­తి­ష్ఠి­స్తాం. ఆయన ప్రా­రం­భిం­చిన ఆసు­ప­త్రి­ని అభి­వృ­ద్ధి చేసి పే­ద­ల­కు మె­రు­గైన వై­ద్య సే­వ­లం­దే­లా చూ­స్తాం. 1956,నవం­బ­ర్ 1న ఆం­ధ్ర­ప్ర­దే­శ్ భాషా సం­యు­క్త రా­ష్ట్రం­గా ఏర్పా­టైం­ది. ఈ తే­దీ­ల­పై కొం­ద­రు రా­జ­కీయ దు­మా­రం సృ­ష్టిం­చే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­రు’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు అన్నా­రు. అం­దు­కే అమ­ర­జీ­వి ఆత్మా­ర్పణ చే­సిన ది­నా­న్ని డే ఆఫ్ శా­క్రి­ఫై­స్ గా ని­ర్వ­హి­స్తు­న్న­ట్టు సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు పే­ర్కొ­న్నా­రు.

ఆయన ప్రా­ణా­లు వి­డి­చిన చె­న్నై­లో­ని భవ­నా­న్ని ‘త్యాగ భవనం’గా గు­ర్తిం­చి, పరి­ర­క్షి­స్తామ’ని చె­ప్పా­రు. ‘ప్ర­జ­ల్ని మభ్య పె­ట్టేం­దు­కు మె­డి­క­ల్ కా­లే­జీల అం­శా­న్ని కొం­ద­రు రా­జ­కీ­యం చే­స్తు­న్నా­రు. మె­రు­గైన చదు­వు, సే­వ­లు కా­వా­లం­టే పీ­పీ­పీ­నే సరైన వి­ధా­న­మ­ని పా­ర్ల­మెం­ట­రీ కమి­టీ స్ప­ష్టం చే­సిం­ది. పీ­పీ­పీ వి­ధా­నం­లో­నే రహ­దా­రు­లు, ఎయి­ర్ పో­ర్టు­లు వంటి సదు­పా­యా­లు అం­ద­రి­కీ అం­దు­బా­టు­లో­కి వచ్చా­యి. ఇప్పు­డు పీ4 తె­చ్చాం. 2047 నా­టి­కి ప్ర­పం­చం­లో­నే తె­లు­గు జా­తి­ని అగ్ర­స్థా­నం­లో ని­ల­బె­ట్టా­ల­న్న­దే తమ లక్ష్యం’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు స్ప­ష్టం చే­శా­రు. అం­త­కు­ముం­దు అమ­ర­జీ­వి జీ­విత వి­శే­షా­ల­ను వి­వ­రి­స్తూ ఏర్పా­టు చే­సిన ఫోటో ఎగ్జి­బి­ష­న్ చం­ద్ర­బా­బు తి­ల­కిం­చా­రు. ఆర్య వై­శ్యుల కు­ల­దై­వం వా­స­వీ కన్య­కా పర­మే­శ్వ­రి ఆత్మా­ర్పణ ది­నా­న్ని అధి­కా­రి­కం­గా ని­ర్వ­హి­స్తు­న్నాం. అమ్మ­వా­రు జన్మిం­చిన పశ్చి­మ­గో­దా­వ­రి జి­ల్లా పె­ను­గొండ గ్రా­మం పే­రు­ను వా­స­వీ పె­ను­గొండ అని మా­ర్చాం. ఆర్య వై­శ్యుల వి­న్న­పం మే­ర­కు కే­స్ట్ సర్టి­ఫి­కె­ట్ల­లో మా­ర్పు­లు చే­స్తు­న్నాం’అని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు పే­ర్కొ­న్నా­రు. వా­స­వీ పె­ను­గొండ మం­డ­లం­గా పేరు మా­ర్చి­నం­దు­కు మహి­ళ­లు ము­ఖ్య­మం­త్రి­కి ధన్య­వా­దా­లు తె­లి­య­చే­స్తూ ప్ల­కా­ర్డు­లు ప్ర­ద­ర్శిం­చా­రు.

Tags:    

Similar News