AMARAVATHI: అమరావతిలో మరో కీలక ఘట్టం

12 బ్యాంకు‌ ప్రధాన కార్యాలయాలకు శంఖుస్థాపన.. భూమిపూజ చేయనున్న నిర్మలా సీతారామన్‌.. ఒకే రోజు, ఒకేసారి 12 బ్యాంకుల శంకుస్థాపన

Update: 2025-09-30 04:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఒక కీలక కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో.. ఒకే రోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. దీంతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రత్యేక ప్రధాన కార్యాలయాలు లేవు.దీంతో ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్10 రోడ్ వద్ద గత ప్రభుత్వాన్ని కింద వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది.

ప్రధాన బ్యాంకులన్నీ ఒకే ప్రాంగణంలో..

స్టే­ట్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా­కు 3 ఎక­రా­లు, ఆప్కా­బ్‌­కు 2 ఎక­రా­లు, కె­న­రా బ్యాం­కు, యూ­బీఐ, బ్యాం­క్‌ ఆఫ్‌ బరో­డా, ఇం­డి­య­న్‌ బ్యాం­కు తది­తర వా­టి­కి 25 సెం­ట్లు చొ­ప్పున ఒకే­చోట ఇచ్చా­రు. ప్ర­ధాన కా­ర్యా­ల­యా­న్నీ 14 అం­త­స్తు­లు, లక్ష చద­ర­పు గజాల వి­స్తీ­ర్ణం­తో ని­ర్మిం­చ­ను­న్నా­రు. వీటి కా­ర్య­క­లా­పా­లు వి­జ­య­వాడ నుం­చి అమ­రా­వ­తి­కి మా­రి­తే అభి­వృ­ద్ధి వేగం పుం­జు­కు­నే అవ­కా­శం ఉంది. ఈ భూ­ము­ల­ను ప్ర­స్తు­తం శు­భ్రం చేసి, కం­చె­లు వే­శా­రు. శం­కు­స్థా­పన, అనం­త­రం ని­ర్మాణ పను­లు ప్రా­రం­భిం­చేం­దు­కు బ్యాం­క­ర్లు సన్నా­హా­లు చే­స్తు­న్నా­రు. స్టే­ట్‌ బ్యాం­కు­కు కే­టా­యిం­చిన స్థ­లం­లో ప్ర­త్యేక కా­ర్య­క్ర­మం ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. సభా వే­ది­క­పై నుం­చే అన్ని బ్యాం­కుల భవ­నాల ని­ర్మా­ణా­ల­కూ ఒకే­సా­రి శం­కు­స్థా­పన చే­స్తా­రు. దీ­ని­కి కేం­ద్ర ఆర్థిక శాఖ మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, ఆర్బీఐ గవ­ర్న­ర్, ఆయా బ్యాం­కుల ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­రు­కా­ను­న్నా­రు. అమ­రా­వ­తి­లో సం­స్థ­లు తమ కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భి­స్తే.. ఇప్పు­డి­ప్పు­డే గత ప్ర­భు­త్వ వి­ధ్వం­సం నుం­చి కో­లు­కుం­టు­న్న రా­జ­ధా­ని­కి మేలు కలు­గు­తుం­ది. ప్ర­త్య­క్ష, పరో­క్ష ఉపా­ధి అవ­కా­శా­లు మె­రు­గ­వు­తున్నాయి.



Tags:    

Similar News