బిల్ గేట్స్ రాక తప్పు అంటున్న వైసీపీ.. ఇక మారరా..?

Update: 2026-02-18 08:11 GMT

ఏపీకి ఎలాంటి మంచి కార్యక్రమం జరుగుతున్నా సరే వైసీపీ దాన్ని సపోర్ట్ చేయకపోగా.. బురదజల్లేందుకు రెడీగా ఉంటుంది. ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నా ఓర్చుకోవట్లేదు. ఇక తాజాగా బిల్ గేట్స్ ఏపీకి వస్తే దేశమంతా ఇటువైపే చూసింది. ఏపీలోని ఇన్నోవేషన్లు, ప్రభుత్వం పాలనలో టెక్నాలజీని ఎలా వాడుతుందో సీఎం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు వివరించారు. బిల్ గేట్స్ ద్వారా ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు అనుకున్నారు. దాని వల్ల కొన్ని పెట్టుబడులు వస్తాయనేది సీఎం చంద్రబాబు ఆశ. దాన్ని కూడా వైసీపీ తప్పుబడుతోంది. బిల్ గేట్స్ ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడని.. అలాంటి వ్యక్తిని ఏపీకి తీసుకొచ్చి రాచమర్యాదలు ఏంటని మండిపడుతున్నారు.

అయితే ఏపీకి బిల్ గేట్స్ రావడం బహుషా వైసీపీకి నచ్చట్లేదేమో. ఎప్ స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు ఉన్న మాట నిజమే. కానీ ఆయనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బిల్ గేట్స్. ఎప్ స్టీన్ తో తనకు పరిచయం ఉన్న మాట నిజమే అని.. అలాంటి వ్యక్తితో పరిచయం ఏర్పడినందుకు చాలా బాధపడుతున్నట్టు బిల్ గేట్స్ చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు ఒక్కటి కూడా నిజం కాదన్నారు. బిల్ గేట్స్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే అని ఇప్పటి వరకు అమెరికా కోర్టు కూడా తేల్చలేదు.

కానీ బిల్ గేట్స్ ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన ఇన్నోవేషన్లలతో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజల చదువు కోసం రూ.90 వేల కోట్లు కేటాయించారు. అలాంటి బిల్ గేట్స్ ఏపీకి వచ్చి సీఎం చంద్రబాబు పాలనను పొగిడితే వైసీపీ తట్టుకోలేకపోతోంది. అందుకే ఇలాంటి పోస్టులు పెట్టి కూటమికి వస్తున్న క్రెడిట్ రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు.

Tags:    

Similar News