మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అమరావతి నిరసన సెగ!
గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడి సాయిబాబ ఆలయం వద్ద ఆయన్ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ నినాదాలు చేశారు.;
ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అమరావతి నిరసన సెగ తగిలింది. గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడి సాయిబాబ ఆలయం వద్ద ఆయన్ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ నినాదాలు చేశారు. మంత్రి ముందే జై అమరావతి అంతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌ను కూడా అడ్డుకుని.. ఆందోళన చేపట్టారు. చివరికి పోలీసులు రైతుల్ని అడ్డుకుని మంత్రి వెల్లంపల్లి కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించారు.