Amaravati : జల దిగ్బంధంలో అమరావతి.. ఎటు చూసినా నీళ్లే!

Update: 2024-09-01 08:30 GMT

భారీ వర్షాలకు గుంటూరు అమరావతి రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. దీంతో అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు తాడు సహాయంతో ఇద్దర్ని కాపాడారు. మరో వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకపోయాడు. గలైంతయిన వ్యక్తి గుంటూరు వాసిగా గుర్తించారు.

అమరావతి రాజధాని పరిధిలో ఊళ్లు మునిగాయి. ఇల్లు, అపార్ట్మెంట్ లలో మొదటి అంతస్తు వరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News