ఏపీ సీఎం జగన్‌కు మరోసారి అమరావతి రైతుల నిరసన సెగ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరోసారి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ గర్జించారు.;
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరోసారి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. సీఎం సచివాలయానికి వెళ్తుండగా మందడంలో రైతులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ గర్జించారు. రైతుల ఆందోళనను పసిగట్టిన పోలీసులు కాన్వాయ్ వైపు వెళ్లకుండా అడ్డు గోడగా నిలబడ్డారు. అమరావతి ఉద్యమాన్ని ఇకకైనా సీఎం గుర్తించాలని రైతులు డిమాండ్ చేశారు.