AP Budget 2022-23 : ఏపీలో ఇవాల్టి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

AP Budget 2022-23 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ప్రసంగించనున్నారు.

Update: 2022-03-07 01:15 GMT

AP Budget 2022-23 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం... సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో.. సీఎం జగన్‌, శాసన సభా వ్యవహారల మంత్రితో పాటు ప్రతిపక్షం నుంచి టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొంటారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. ఈ మీటింగ్‌ ముగిసిన వెంటనే సచివాలయంలో.. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశమవుతుంది.

అసెంబ్లీలో 11వ తేదీన ప్రవేశపెట్టనున్న 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఇటీవల మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా చర్చించనుంది. హైకోర్టు తీర్పులో రాజధానిపై చట్టం చేసే హక్కు లేదని పేర్కొనటంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

చట్టం చేసే హక్కు లేకపోతే ఇంకెరికి ఉందంటూ ప్రశ్నిస్తున్నారు మంత్రులు. దీంతో ఈ అంశంపై కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై చర్చించనున్నారు. హైకోర్టు తీర్పుతో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, ఏఎంఆర్డిఏ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆలోచనను ప్రస్తుతానికి కేబినెట్‌ విరమించుకున్నారు.

ఈ బిల్లులను భవిష్యత్తులో చట్టం చేయడంపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానపై చర్చిస్తారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపైనా... ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News