Ap High Court : సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షను నిలిపివేసిన ఏపీ హైకోర్టు..!
Ap High Court : ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు..;
Ap High Court : ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు... తన నిర్ణయం నిర్ణయంపై కాస్త వెనక్కి తగ్గింది. పంచాయతీ రాజ్ శాఖలో 36 మందిని రెగ్యులర్ చేయమంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్‌ఎస్ అధికారి చిరంజీవి చౌదరి జాప్యం చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... వారిద్దరికీ వారం రోజుల జైలు శిక్ష విధించింది. అయితే అధికారులు కోర్టు ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేసి... ఆదేశాలను అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో.. కోర్టు వెనక్కి తగ్గింది. తన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.