AP High Court : ఎనిమిది మంది ఐఏఎస్‌ లకు ఏపీ హైకోర్టు షాక్

AP High Court : ఆదేశాలు పాటించని ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.

Update: 2022-03-31 09:15 GMT

AP High Court (tv5news.in)

AP High Court : ఆదేశాలు పాటించని ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటుపై గతంలో పిల్‌ దాఖలైంది. దీన్ని విచారించిన హైకోర్టు.. పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది. ఐతే.. ఈ ఆదేశాలను ఐఏఎస్‌ అధికారులు పాటించలేదు. దీంతో కోర్టు ధిక్కరణగా భావించి వీరికి జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధించడంతో.. ఐఏఎస్‌ అధికారులు కోర్టును క్షమాణలు కోరారు. దీంతో.. జైలు శిక్ష తప్పించి.. ఏడాది పాటు ప్రతి నెలలో ఒక రోజు హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు హాస్టల్‌లో ఒక రోజు భోజనం పెట్టాలని స్పష్టం చేసింది. సీనియర్‌ ఐఏఎస్‌లు విజయ్‌ కుమార్, శ్యామలరావు, చినవీరభద్రుడు.. గోపాలకృష్ణ ద్వివేది, ఎంఎం నాయక్, బుడితి రాజశేఖర్.. శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News