Andhra Pradesh: భారత్‌లో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం..
Andhra Pradesh: రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది.;
Andhra Pradesh: రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020 సంవత్సరానికి గాను సమర్పించిన నివేదిక ప్రకారం ఏపీలో 704 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో 564 మంది రైతులు, 140 మంది కౌలు రైతులు ఉన్నట్లు చెప్పారు. రైతుల బాగుకోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఖరీఫ్, రబీల్లో పండే అన్ని రకాల పంటలకూ.. కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు పీఎం కిసాన్, పీఎం ఫసల్ భీమా యోజన, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.