నెల్లూరు జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనకు ఈ నెల 23వ తేదీన కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వివాదంపై అనేక మంది స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే, అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు నోటీసులను ఆయన ఇంటి గేట్‌కు అతికించారు.ఇక, ఈ నోటీసులపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తాను విచారణకు హాజరుకాలేకపోవడానికి వ్యక్తిగత కారణాలతో పాటు కోర్టులో క్యాష్ పిటిషన్ ఉందని తెలిపారు.