Andhra Pradesh News : రప్పా రప్పా బ్యాచ్ షాక్.. జగన్ మారడా..?

Update: 2026-04-11 11:30 GMT

వైపీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ స్థాయిలో విధ్వంసం, అశాంతి సృష్టించాలని చూస్తుందో అందరికీ తెలిసిందే. జగన్ ఎక్కడకు వెళ్లినా సరే ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. జగన్ ఎక్కడకు వెళ్లినా సరే అక్కడ రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్ కోర్టులకు వెళ్లినా లేదంటే పరామర్శలకు వెళ్లినా సరే ఇవే విధ్వంసపు ఫ్లెక్సీలు. ఇప్పుడు ర్యాలీల్లోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ జగన్ పేరుతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. '2029 తర్వాత నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ కొందరు ఫ్లెక్సీలు పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఏకంగా హైకోర్టు సీరియస్ అయింది. ఇలా ఫ్లెక్సీలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్న వైసీపీ వాళ్లపై కూడా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటి వరకు జగన్ స్పందించలేదు. చివరకు ధర్మాసనాలు కూడా సీరియస్ ఆర్డర్లు ఇస్తున్నా సరే జగన్ చీమకు కుట్టినట్టు కూడా లేదు. ఎంతసేపు తన కార్యకర్తలు, తన నాయకులు ఏం మాట్లాడినా అటే సపోర్టు చేస్తున్నారు. అంతే గానీ.. తన కార్యకర్తలను కనీసం కంట్రోల్ చేయట్లేదు.

పైగా సినిమా డైలాగులు ఫ్లెక్సీలు పెడితే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే జగన్ తన మనసులో మాటను నేరుగా సమర్థించేసుకుంటున్నారన్నమాట. ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి చట్టాలను, కోర్టులను గౌరవించాలి అని అనకపోవడం మరీ దారుణం అనే చెప్పుకోవాలి. దీన్ని బట్టి జగన్ అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడే క్లియర్ గా అర్థం అవుతోంది. కాబట్టి ఈ విషయాలను ప్రజలు కచ్చితంగా గమనించి సరైన బుద్ధి చెప్పాలని కూటమి నేతలు అంటున్నారు.

Tags:    

Similar News