Chandrababu Naidu : భోగాపురంలో మహానాడు.. టీడీపీకి ప్లస్ పాయింట్..!

Update: 2026-04-11 13:45 GMT

ఉత్తరాంధ్రలో టీడీపీ బలం ఎంతగా పెరిగిపోతోందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ప్రోగ్రామ్ కూడా అన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం జరిగేలా నిర్వహిస్తుంటారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. గతంలో రాయలసీమ జిల్లాల్లో నిర్వహించారు. ఆ తర్వాత మధ్య ఏపీ జిల్లాల్లో నిర్వహించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ అతిపెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం కూడా టీడీపీకి కలిసొచ్చే ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే టీడీపీకి కొన్ని జిల్లాల్లో గతంలో పట్టు పూర్తిగా లేదు.

కానీ ఇప్పుడు మారుతున్న సమీకరణాల వల్ల టీడీపీకి అన్ని జిల్లాల్లో మంచి పట్టు పెరుగుతోంది. ఇప్పుడు మహానాడు ఉత్తరాంధ్రలో నిర్వహించడం వల్ల ఇక్కడి ప్రజలను ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రజలు కూడా పార్టీని తమ పార్టీగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇక్కడ యువ రాజకీయ నాయకులకు ఇదో పెద్ద అవకాశంగా మారుతుంది. మహానాడు కార్యక్రమంలో కీలక అంశాలపై ప్రకటనలు ఉండే ఛాన్స్ ఉంటుంది.

ఈ ప్రకటనలు యువ రాజకీయ నాయకులకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఉత్తరాంధ్ర యువకులను ఆకట్టుకునే విధంగానే ఈ మహానాడు కార్యక్రమం జరగబోతున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడే వారికి త్వరలోనే మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News