ఆంధ్రప్రదేశ్‌లో వంట గ్యాస్ వినియోగదారులపై మరో బండ
ఆంధ్రప్రదేశ్‌లో వంట గ్యాస్ వినియోగదారులపై మరో బండ పడింది. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత మోగించిన ఏపీ సర్కారు.. తాజాగా.. వంట గ్యాస్‌పై..;
ఆంధ్రప్రదేశ్‌లో వంట గ్యాస్ వినియోగదారులపై మరో బండ పడింది. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత మోగించిన ఏపీ సర్కారు.. తాజాగా.. వంట గ్యాస్‌పై 10 శాతం మేర వ్యాట్ పెంచింది. ఈ మేరకు జీవో నెంబర్ 265 ను విడుదల చేసింది. ఈ పెంపుతో ఇప్పటివరకు 14.5 శాతం ఉన్న విలువ ఆధారిత పన్ను... ఇప్పుడు 24.5 శాతానికి చేరింది. కరోనా కారణంగా రాష్ట్ర ఖజానా కుదేలైందని, సంక్షేమ పథకాల అమలు కూడా కష్టంగా మారిందని... అందువల్లే పన్నులు పెంచాల్సి వచ్చిందని... ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.