AP: పాస్‌పుస్తకం లేకపోయినా మూడేళ్ల పాటు రైతు భరోసా
ఎమ్మెల్యే అందజేసిన కరపత్రం చూసి కుటుంబ సభ్యులు షాక్;
భూమి పాస్‌పుస్తకం లేకపోయినా మూడేళ్ల పాటు రైతు భరోసా ఇచ్చేశారు అధికారులు. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే అందజేసిన కరపత్రం చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో చోటుచేసుకుంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పిట్టా మధుసూదన్‌రెడ్డికి ఎలాంటి భూమి లేదు. అయితే ప్రభుత్వం నుంచి ఈ మూడేళ్లలో రైతు భరోసా పథకం కింద 38వేల 500, సున్నా వడ్డీ కింద మొత్తం 39వేల 632 లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కరపత్రం అందజేశారని మధుసూదన్‌రెడ్డి తండ్రి తెలిపారు. ఎలాంటి లబ్ధి అందకపోయినా కరపత్రాలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించాడు.