AP : స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలపై వైసీపీ విషప్రచారం : పట్టాభి
అవినీతి జరిగితే.. 2లక్షల మంది ఎలా శిక్షణ తీసుకున్నారో.. 64వేల మంది యువతకు ఉపాధి ఎలా లభించిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు;
స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో అవినీతి అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు టీడీపీ నేత పట్టాభి. షెల్ కంపెనీల సృష్టిలో, మనీలాండరింగ్‌లో దేశంలో జగన్‌ను మించిన వారే లేరని సీబీఐ, ఈడీలే తేల్చాయని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగితే.. 2లక్షల 11వేల మంది ఎలా శిక్షణ తీసుకున్నారో.. 64వేల మంది యువతకు ఉపాధి ఎలా లభించిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన 3వేల 300 కోట్ల అంచనా వ్యయం సరైందేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఐటీడీనే ధృవీకరించిందన్నారు. జగన్, అతని ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు, అతని కుటుంబానికి రవ్వంత అవినీతిని కూడా అంటించలేరన్నారు.