నెల్లూరులో అమ్మణ్ని జాతరను కొందరు రాజకీయం చేశారని ఫైర్ అయ్యారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. పరమేశ్వరి ఆలయంలో మూగ చాటింపు చేసిన ఆయన.. ఎంపీ అదాల, వైసీపీ నేతలు, ఈవో టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
జాతరకి అనుమతే అవసరం లేదని నిన్న ఎండోమెంట్ కమిషనర్ చెప్పారని కోటంరెడ్డి అన్నారు. జాతర కార్యక్రమం ఎమ్మెల్యే సొంత వ్యవహారమని..దేవాదాయ శాఖకి సంబంధం లేదని ఈవో పేరుతో మెసేజ్‌లు, పోస్టర్లు వచ్చాయని చెప్పారు. జాతరను నిర్వహించకుండా అధికార మదంతో ఎంపీ అదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి అడ్డుకున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.