AP : అమరావతిపై సుప్రీంలో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
28వ తేదీకన్నా ముందే విచారణ జరపాలన్నఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది;
అమరావతిపై సుప్రీంలో జగన్ సర్కార్‌కు చుక్కెదురురైంది. అమరావతి కేసును 28వ తేదీనే విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్ తేల్చిచెప్పారు. 28వ తేదీకన్నా ముందే విచారణ జరపాలన్నఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.
రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో చాలా ఇమిడి ఉన్నాయని జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని, బుధ, గురు వారాల్లో కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురు వారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్యులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ఐతే.. సీజేఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు.