AP: సంక్షేమం పరిఢవిల్లేలా.. అభివృద్ధి పరుగులెత్తేలా..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ 2026-27... రూ.3.45 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్... సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Update: 2026-02-14 15:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో అసెం­బ్లీ­లో బడ్జె­ట్ పె­ట్టా­రు. 2026-27 ఆర్థిక సం­వ­త్స­రా­ని­కి సం­బం­ధిం­చి బడ్జె­ట్‌­ను ఆర్థిక మం­త్రి పయ్యా­వుల కే­శ­వ్ ఏపీ అసెం­బ్లీ­లో ఉదయం 11.22 ని­మి­షా­ల­కు పె­ట్టా­రు. ఈసా­రి బడ్జె­ట్‌­ను రూ.3.32 లక్షల కో­ట్ల అం­చ­నా­తో ప్ర­వే­శ­పె­ట్టా­రు. సం­క్షేమ పథ­కా­ల­కు, ప్రా­జె­క్టు­ల­కు భా­రీ­­గా కే­టా­యిం­పు­లు చే­శా­రు. ఇటు మం­త్రి అచ్చె­న్నా­యు­డు వ్య­వ­సాయ బడ్జె­ట్‌­ను అసెం­బ్లీ­లో ప్ర­వే­శ­పె­డ­తా­రు. అం­త­క­ముం­దు ఏపీ కే­బి­నె­ట్ భే­టీ­లో బడ్జె­ట్‌­కు ఆమో­దం తె­లి­పా­రు. ఈ రోజు మనం ఎం­చు­కు­న్న మా­ర్గా­లే... రే­ప­టి మన భవి­ష్య­త్తు­ను ని­ర్ణ­యి­స్తా­యి’ అని అన్నా­రు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ఆర్థి­క­శాఖ మం­త్రి పయ్యా­వుల కే­శ­వ్‌. రా­ష్ట్ర ఆర్థి­క­వ్య­వ­స్థ­ను జా­గ్ర­త్త­గా ని­ర్వ­హి­స్తూ ఆర్థిక క్ర­మ­శి­క్ష­ణ­ను పా­టి­స్తు­న్నా­మ­ని అం­దు­కు ప్ర­భు­త్వం తీ­సు­కుం­టు­న్న చర్య­ల­ను బడ్జె­ట్‌ సం­ద­ర్భం­గా ప్ర­త్యే­కం­గా ప్ర­స్తా­విం­చా­రు. ము­ఖ్యం­గా గత ప్ర­భు­త్వం అడ్డ­గో­లు­గా చే­సిన అప్పు­ల­పై వడ్డీ­రే­ట్లు తగ్గిం­చేం­దు­కు పలు చర్య­లు చే­ప­ట్టి­న­ట్లు పయ్యా­వుల వి­వ­రిం­చా­రు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా ఏకంగా 12.3 శాతం వరకు కూడా వైకాపా ప్రభుత్వం అప్పులు తెచ్చింది. రాష్ట్రానికి ఆర్థిక భారంగా పరిణమించిన ఆ వడ్డీ రుణాలను 9శాతం లేదా అంతకంటే తక్కువకు తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలను చేపడుతున్నాం. రాష్ట్ర రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గింది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 2025- 26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 41, 118.36 కోట్లుకు చేరింది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 22, 002.50 కోట్లు ఉంది.

2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రూ. 80,567.47 కోట్ల ద్రవ్య లోటుగా నమోదు అయింది. ఇక, 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ. 75,868.09 కోట్లుగా ఉండొచ్చని అంచనా. "ఇప్ప­టి­వ­ర­కు రూ.43,298 కో­ట్ల రు­ణా­ల­కు వడ్డీ­ని తగ్గిం­చి, సం­వ­త్స­రా­ని­కి రూ.327 కో­ట్లు ఆదా చే­శాం. అద­నం­గా మరో రూ.1.2 లక్షల కో­ట్ల రు­ణా­ల­పై మె­రు­గైన షర­తు­లు పొం­దేం­దు­కు చర్య­లు తీ­సు­కుం­టు­న్నాం. దీ­ని­ద్వా­రా సం­వ­త్స­రా­ని­కి సు­మా­రు రూ.1,658 కో­ట్ల ఆదా అవు­తుం­ద­ని అం­చ­నా. పం­చా­య­తీ­లు, ము­న్సి­పా­లి­టీ­ల­ను బలో­పే­తం చే­య­డా­ని­కి ఆర్థిక సంఘం గ్రాం­ట్ల కింద రూ.3,797 కో­ట్ల­ను వి­డు­దల చే­శాం. 12 జూన్ 2024 నా­టి­కి పెం­డిం­గ్‌­లో ఉన్న రూ.24,811 కో­ట్ల బకా­యి­ల­ను క్లి­య­ర్ చే­శాం. సా­గు­నీ­రు, రహ­దా­రు­లు, ఇతర పను­ల­కు రూ.37,030 కో­ట్ల­ను చె­ల్లిం­చి ఆర్థిక కా­ర్య­క­లా­పా­ల­ను పు­న­రు­ద్ధ­రిం­చాం." అని పయ్యా­వుల కే­శ­వ్ తె­లి­పా­రు. . గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా..‘‘మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌ వ్యాఖ్యను ప్రస్తావించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News