AP : మురికి వాడలపై జగన్ సర్కార్ గ్రీన్‌ మ్యాట్‌

నగరంలో ఉన్న పేదలు, మురికివాడలు బయటి ప్రపంచానికి కనిపించకుండా.. జాతీయ రహదారి పొడవున ఆకుపచ్చ పరదాలు కట్టారు అధికారులు

Update: 2023-03-28 11:19 GMT

విశాఖలో రిషికొండకు గ్రీన్‌ మ్యాట్‌ కప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న జగన్‌ సర్కారు.. ఇప్పుడు పేదలు, మురికివాడలపై పడింది. నగరంలో పేదలు, మురికివాడలు కనిపించకుండా.. పచ్చటి పరదాలు కట్టేసింది. జీ 20 సమావేశాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న పేదలు, మురికివాడలు బయటి ప్రపంచానికి కనిపించకుండా జాతీయ రహదారి పొడవున ఆకుపచ్చ పరదాలు కట్టారు అధికారులు. సుందరీకరణ పేరుతో పేదలు కనిపించకుండా ఈ పరదాలు కట్టారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసిన ప్రభుత్వం.. తమకు కనీస అవసరాలు తీర్చడంపై ఎందుకు శ్రద్ద పెట్టడం లేదంటూ మండిపడుతున్నారు పేదలు. మరోవైపు.. జాతీయ రహదారి వెంట గ్రీన్‌ బెల్ట్‌ను పరిరక్షించాల్సిన జీవీఎంసీ.. బడాబాబుల జోలికి వెళ్లట్లేదు. బిర్లా జంక్షన్‌ ఏరియాలో గ్రీన్‌ బెల్ట్‌ను ఆక్రమించుకుని ఇష్టానుసారం చెట్లు నరికేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు స్థానికులు. 


Tags:    

Similar News