AP: ఏపీలో నిరుద్యోగులకు పండగే
ఏపీలో నిరుద్యోగులకు లోకేష్ శుభవార్త... వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్... ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు.. యువత సిద్ధంగా ఉండాలన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలను సైతం కల్పిస్తుంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గుడ్‌న్యూస్ తెలిపారు. నిరుద్యోగులకు పండగలాంటి తీపికబురు చెప్పారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే మరో నెల రోజుల్లో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. ఈ జాబ్‌క్యాలెండర్ల ద్వారా ఎప్పుడు, ఏ నోటిఫికేషన్ విడుదల కానుందో తెలుస్తోంది. ఈ సమాచారం ప్రకారం నిరుద్యోగులు ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యేందుకు ప్రణాళికలు రచించుకునేందుకు వీలవుతుంది. ఏది ఏమైనప్పటికీ జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని.. అందుకే ‘నైపుణ్యం’ అనే కొత్త పోర్టల్‌ను ప్రారంభించామన్నారు మంత్రి లోకేష్.
ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు అన్నారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, "కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తోందని," అని మంత్రి చెప్పారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, "జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు." అని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఇంక్యుబేషన్ సెంటర్, ప్రధాన ముఖద్వారం, వందేమాతరం ఉద్యానాన్ని ప్రారంభించారు. ఎన్ని కేసులు వేసినా డీఎస్సీ పూర్తి చేసి 16 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇటీవల 6 వేలమందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్.. కాగ్నిజెంట్‌లో 25 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు.