AP: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి స్వర్ణ కళ

ఏపీ టూరిజానికి అర్ధ శతాబ్దం పూర్తి.... తిరిగి గాడినపడుతున్న ఏపీ టూరిజం.. వైసీపీ పాలనలో పర్యాటకం గందరగోళం.. మళ్లీ పుంజుకుంటున్న పర్యాటక రంగం

Update: 2026-02-19 04:30 GMT

వై­సీ­పీ ప్ర­భు­త్వ కా­లం­లో ని­ర్ల­క్ష్యా­ని­కి గు­రైం­ద­నే వి­మ­ర్శ­లు ఎదు­ర్కొ­న్న ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ పర్యా­టక రంగం ప్ర­స్తు­తం మళ్లీ పుం­జు­కుం­టోం­ద­ని అధి­కార వర్గా­లు చె­బు­తు­న్నా­యి. కూ­ట­మి ప్ర­భు­త్వం పర్యా­టక రం­గా­ని­కి పా­రి­శ్రా­మిక హోదా కల్పిం­చి ప్రో­త్సా­హ­కా­లు ప్ర­క­టిం­చ­డం­తో పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షి­త­మ­వు­తు­న్నా­య­ని పే­ర్కొం­టు­న్నా­రు. ప్ర­భు­త్వ–ప్రై­వే­ట్‌ భా­గ­స్వా­మ్య (PPP) వి­ధా­నం­లో హో­ట­ళ్లు, రి­సా­ర్ట్‌­లు, వి­నోద కేం­ద్రా­లు ఏర్పా­ట­వు­తు­న్నా­యి. ఇదే సమ­యం­లో రా­ష్ట్ర పర్యా­ట­కా­భి­వృ­ద్ధి సం­స్థ పర్యా­ట­కు­ల­ను ఆక­ట్టు­కు­నే­లా వి­నూ­త్న సే­వ­లు ప్రా­రం­భి­స్తోం­ది. 1976 ఫి­బ్ర­వ­రి 18న పరి­మిత సే­వ­ల­తో ప్రా­రం­భ­మైన ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ పర్యా­ట­కా­భి­వృ­ద్ధి సం­స్థ (ఏపీ­టీ­డీ­సీ) బు­ధ­వా­రం నా­టి­కి 50 ఏళ్లు పూ­ర్తి చే­సు­కుం­టోం­ది. ప్రా­రంభ దశలో కొ­న్ని హరిత హో­ట­ళ్లు, పరి­మిత వస­తు­ల­తో మా­త్ర­మే సే­వ­లం­దిం­చిన ఈ సం­స్థ, అం­చె­లం­చె­లు­గా వి­స్త­రిం­చి ఇప్పు­డు రా­ష్ట్ర పర్యా­టక రం­గం­లో కీలక పా­త్ర పో­షి­స్తోం­ది. హరిత హో­ట­ళ్లు, రి­సా­ర్ట్‌­లు, పర్యా­టక ప్యా­కే­జీ­లు, ఆధ్యా­త్మిక యా­త్ర­లు, జల వి­హా­రా­లు వంటి అనేక రం­గా­ల్లో సే­వ­ల­ను వి­స్త­రిం­చిం­ది. ఏపీటీడీసీ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ప్ర­స్తు­తం ప్ర­తి సం­వ­త్స­రం సు­మా­రు 27.8 కో­ట్ల దే­శీయ పర్యా­ట­కు­లు, దా­దా­పు 1.8 లక్షల వి­దే­శీ పర్యా­ట­కు­లు రా­ష్ట్రా­న్ని సం­ద­ర్శి­స్తు­న్నా­ర­ని అధి­కార గణాం­కా­లు సూ­చి­స్తు­న్నా­యి. పర్యా­టక రం­గం­లో చూ­పిన ప్ర­గ­తి­కి గు­ర్తిం­పు­గా 2025లో ఏపీ­టీ­డీ­సీ­కి గ్లో­బ­ల్‌ టూ­రి­జం అవా­ర్డు కూడా లభిం­చిం­ది. కూ­ట­మి ప్ర­భు­త్వం పర్యా­టక రం­గా­ని­కి పా­రి­శ్రా­మిక హోదా కల్పిం­చ­డం కీలక మలు­పు­గా మా­రిం­ది. ఈ హోదా కా­ర­ణం­గా పీ­పీ­పీ వి­ధా­నం­లో రూ.17,973 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు 103 ఒప్పం­దా­లు కు­ది­రా­యి. వీటి ద్వా­రా దా­దా­పు 97,876 మం­ది­కి ఉపా­ధి అవ­కా­శా­లు కల్పిం­చ­ను­న్న­ట్లు ప్ర­భు­త్వం వె­ల్ల­డిం­చిం­ది. రా­ష్ట్రం­లో అనేక ప్రాం­తా­ల్లో స్టా­ర్‌ హో­ట­ళ్లు, ప్రీ­మి­యం రి­సా­ర్ట్‌­లు ని­ర్మాణ దశలో ఉన్నా­యి. 2028 నా­టి­కి 50 వేల గదు­లు అం­దు­బా­టు­లో ఉం­చా­ల­నే లక్ష్యం­తో హో­ట­ల్‌ రం­గా­న్ని ప్రో­త్స­హి­స్తు­న్నా­రు. పర్యా­టక రంగం రా­ష్ట్ర స్థూల వి­లువ (GVA)లో ప్ర­స్తు­తం 4.6 శాతం వాటా కలి­గి ఉం­డ­గా, 2029 నా­టి­కి దా­న్ని 8 శా­తా­ని­కి పెం­చ­డ­మే లక్ష్యం­గా కా­ర్యా­చ­రణ కొ­న­సా­గు­తోం­ది. పీ­పీ­పీ వి­ధా­నం­లో పర్యా­టక శాఖ భూ­ము­ల­ను లీ­జు­కు ఇస్తోం­ది. సొంత భూ­ము­ల్లో హో­ట­ల్‌ ని­ర్మా­ణా­లు చే­ప­ట్టే వా­రి­కి స్టాం­పు డ్యూ­టీ, వి­ద్యు­త్‌ చా­ర్జీ­లు, ఆస్తి­ప­న్ను, జీ­ఎ­స్‌­టీ తది­తర అం­శా­ల్లో రా­యి­తీ­లు అం­ది­స్తోం­ది. ఈ రా­యి­తీ­లు పె­ట్టు­బ­డి­దా­రు­ల­ను ఆక­ర్షి­స్తు­న్నా­యి. గత ప్ర­భు­త్వ కా­లం­లో తీ­సు­కు­న్న కొ­న్ని ని­ర్ణ­యా­లు పర్యా­టక రం­గం­పై ప్ర­తి­కూల ప్ర­భా­వం చూ­పి­న­ట్లు అధి­కా­రు­లు పే­ర్కొం­టు­న్నా­రు.

Tags:    

Similar News