AP: బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ టెండర్లు రద్దు

డీపీఆర్ కోసం చేపట్టిన టెండర్లు రద్దు

Update: 2025-11-08 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం బన­క­చ­ర్ల­పై వె­న­క్కి తగ్గి­న­ట్టు కని­పి­స్తోం­ది. పో­ల­వ­రం-బన­క­చ­ర్ల లిం­క్ ప్రా­జె­క్టు ని­ర్మా­ణా­ని­కి డీ­పీ­ఆ­ర్ కోసం చే­ప­ట్టిన టెం­డ­ర్ల ప్ర­క్రి­య­ను రద్దు చే­స్తు­న్న­ట్లు కూ­ట­మి ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ది. హై­ద­రా­బా­ద్‌­లో జరి­గిన పో­ల­వ­రం అథా­రి­టీ సమా­వే­శం­లో ఈ అం­శా­న్ని వె­ల్ల­డిం­చిం­ది. అం­త­ర్రా­ష్ట్ర నదీ­జ­లాల ఒప్పం­దా­ల­కు వి­రు­ద్ధం­గా ఏపీ ఈ ప్రా­జె­క్టు­ను చే­ప­డు­తోం­ద­ని తె­లం­గాణ తొలి నుం­చి వ్య­తి­రే­కి­స్తూ వచ్చిం­ది. దీ­ని­పై కేం­ద్రా­ని­కి, సీ­డ­బ్ల్యూ­సీ­కి ఫి­ర్యా­దు చే­సిం­ది. న్యా­య­పో­రా­టా­ని­కీ సి­ద్ధ­మైం­ది. దీం­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ప్ర­భు­త్వం ఈ కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఫలి­తం­గా పో­ల­వ­రం-బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు లే­న­ట్టే­న­ని అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. అయి­తే ఈ ప్రా­జె­క్టు­పై ఇరు రా­ష్ట్రా­ల­కు ఎలాం­టి వి­వా­దం రా­కుం­డా మరో ప్ర­ణా­ళి­క­తో కూడా ఏపీ ముం­దు­కు వచ్చే అవ­కా­శా­లు ఉన్న­ట్టు చె­బు­తు­న్నా­రు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం-బనకచర్ల అనుసంధానం స్థానంలో పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డీపీఆర్‌ తయారీకి పాత పేరు, పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు. ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కిందిస్థాయి అధికారులకు అందాయి. దీంతో డీపీఆర్‌ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్‌ఈ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ....

బన­క­చ­ర్ల­కు ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ అను­మ­తు­లు ఇవ్వ­వ­ద్ద­ని స్వ­యం­గా సీఎం రే­వం­త్​­రె­డ్డి, ఇరి­గే­ష­న్​­శాఖ మం­త్రి ఉత్త­మ్​­కు­మా­ర్ రె­డ్డి కేం­ద్రా­ని­కి లే­ఖ­లు రా­య­డం­తో పాటు.. రెం­డు రా­ష్ట్రాల సీ­ఎం­ల­తో కేం­ద్రం ఏర్పా­టు చే­సిన మీ­టిం­గు­లో­నూ పా­ల్గొ­న్నా­రు. ఆనా­డు లోపల బన­క­చ­ర్ల గు­రిం­చి చర్చ జర­గ­లే­ద­ని చె­ప్పి­నా..  ఏపీ ఇరి­గే­ష­న్ మం­త్రి ని­మ్మల రా­మా­నా­యు­డు బయట మీ­డి­యా­తో  బన­క­చ­ర్ల­ను కట్టి­తీ­రు­తా­మ­ని చె­ప్పా­రు. ఇప్పు­డు ఆ వ్య­వ­హా­రం డీ­పీ­ఆ­ర్​­త­యా­రీ­కి టెం­డ­ర్ల వరకు వచ్చిం­ది. దీం­తో ఈ వ్య­వ­హా­రం­పై ఈఎ­న్సీ జన­ర­ల్​­పో­ల­వ­రం ప్రా­జె­క్ట్​ అథా­రి­టీ (పీ­పీఏ)తో పాటు సెం­ట్ర­ల్​­వా­ట­ర్​­క­మి­ష­న్​(సీ­డ­బ్ల్యూ­సీ)కు ఫి­ర్యా­దు చే­శా­రు. టెం­డ­ర్ల ప్ర­క్రి­య­ను ఎట్టి పరి­స్థి­తు­ల్లో ఆపా­ల­ని డి­మాం­డ్​­చే­శా­రు. ఏపీ అక్ర­మం­గా ఎలాం­టి అను­మ­తు­లు లే­కుం­డా­నే ప్రా­జె­క్టు చే­ప­డ్తోం­ద­ని, వరద జలాల కా­న్సె­ప్టే లే­న­ప్పు­డు దాని ఆధా­రం­గా ఎలా ప్రా­జె­క్టు­ను చే­ప­డ­తా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. వెం­ట­నే టెం­డ­ర్ల ప్ర­క్రి­య­ను ఆప­డం­తో పాటు ముం­దు­కు వె­ళ్ల­కుం­డా ఏపీ­ని కట్ట­డి చే­యా­ల­ని కో­రా­రు.బన­క­చ­ర్ల వి­ష­యం­లో ఏపీ దూ­కు­డు­పై తె­లం­గాణ మొ­ద­టనుం­చీ ఆం­దో­ళన వ్య­క్తం చే­స్తు­న్న­ది. 

Tags:    

Similar News