AP: ఏపీలో రూ. లక్ష కోట్ల పెట్టబడులకు ఆమోదం
12వ పెట్టుబడుల ప్రోత్సహక మండలి భేటీ.. కీలక ప్రతిపాదనలకు మండలి ఆమోదముద్ర.. 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల.. 85 వేలకుపైగా ఉద్యోగాల కల్పన
ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం 12వ ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్లస్టర్ వారీగా పారిశ్రామికాభివృద్ధి చేపడతామని తెలిపారు. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లను అభివృద్ధి చేస్తామన్నారు. పెట్టుబడుల సదస్సు కంటే ముందే వివిధ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తామన్నారు. వీటి వల్ల 85 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నట్లు తెలిపింది. మూడు మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల సదస్సు ముందే శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. కాగా, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో క్లస్టర్ వారీగా పారిశ్రామికాభివృద్ధి చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సీఎం అధ్యక్షతన భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె. అచ్చెన్నాయుడు, టి జి భరత్, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్థన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించడమే కాకుండా.. అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పెట్టుబడిదారులకు భూమి, విద్యుత్ వంటి వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ఫిర్యాదులకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు పొంది కూడా పనులు ప్రారంభించని ప్రాజెక్టులను సమీక్షించి.. పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీసీఐ భాగస్వామ్య సదస్సును ఘనంగా నిర్వహించాలని.. ఆ సదస్సు కంటే ముందే తాజాగా ఆమోదం పొందిన పరిశ్రమలకు శంకుస్థాపనలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొంటామని తెలిపారు.