ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో బిల్లుకు ఆమోదం లభించింది. మాజీ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమీషన్ నివేదికకు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో భాగంగా ఏ కేటగరీలో రెల్లి మరో 12 ఉప కులాలు ఉంటాయి. ఇక బి కేటగరీలో మాదిగతో పాటు 18 ఉప కులాలుంటాయి. సి కేటగరీలో మాలతో పాటు 25 ఉప కులాలు ఉంటాయి. డి కేటగరీలో ఆది ఆంధ్ర సహా ఉప కులాలు ఉంటాయి. మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A రెల్లి మరియూ సబ్ క్యాస్ట్ వారికి 1%, గ్రూప్ B మాదిగ & సబ్ క్యాస్ట్ వారికి 6%, గ్రూప్ C మాల & సబ్ క్యాస్ట్ వారికి 8% వస్తుంది.రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికీ 1% గ్రూప్ B వారికీ 7%, గ్రూప్ C వారికి 7% వర్తించనుంది.