AP BUDGET: ఫిబ్రవరి 14న సభలో ఏపీ బడ్జెట్

17 రో­జు­ల­పా­టు అసెం­బ్లీ కా­ర్య­క­లా­పా­లు

Update: 2026-02-12 04:30 GMT

ఏపీ శా­స­న­సభ స్పీ­క­ర్‌ అయ్య­న్న­పా­త్రు­డు అధ్య­క్ష­తన ని­ర్వ­హిం­చిన బీ­ఏ­సీ సమా­వే­శం­లో కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. మా­ర్చి 7 వరకు అసెం­బ్లీ సమా­వే­శా­లు ని­ర్వ­హిం­చా­ల­ని.. అవ­స­ర­మై­తే పొ­డి­గిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. 17 రో­జు­ల­పా­టు అసెం­బ్లీ కా­ర్య­క­లా­పా­లు ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఈనెల 14న బడ్జె­ట్‌ ప్ర­వే­శ­పె­ట్ట­ను­న్నా­రు. 15 ఆది­వా­రం కాగా.. మహా శి­వ­రా­త్రి తర్వాత రోజు 16న సె­ల­వు ప్ర­క­టిం­చా­రు. 17, 18 తే­దీ­ల్లో బడ్జె­ట్‌­పై చర్చ జర­గ­నుం­ది. 18న ఆర్థిక మం­త్రి సమా­ధా­నం ఇవ్వ­ను­న్నా­రు. ఫి­బ్ర­వ­రి 24, 25, 26 తే­దీ­ల్లో ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­ల­కు క్రీ­డా­పో­టీ­లు ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. మా­ర్చి 1, 2, 3 తే­దీ­ల్లో అసెం­బ్లీ­కి సె­ల­వు ప్ర­క­టిం­చా­రు. మా­ర్చి 6న అమ­రా­వ­తి­లో­నే సాం­స్కృ­తిక కా­ర్య­క్ర­మా­లు ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. రోజూ ఉదయం 9 నుం­చి మధ్యా­హ్నం 2 గంటల వరకు సమా­వే­శా­లు జర­గ­ను­న్నా­యి. ఉదయం 10 గం­ట­ల­కు ప్ర­శ్నో­త్త­రా­లు ము­గిం­చా­ల­ని.. రోజూ జీరో అవ­ర్‌ ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు.

అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ అసెం­బ్లీ­లో డి­జి­ట­ల్ అటెం­డె­న్స్ వి­ధా­నం అమ­ల్లో­కి రా­నుం­ది. ఇకపై సభ్యుల హా­జ­రు నమో­దు ఫే­షి­య­ల్ రి­క­గ్ని­ష­న్ సాం­కే­తి­కత ద్వా­రా జర­గ­నుం­ది. సభ్యు­లు అసెం­బ్లీ­కి వచ్చి సభ లోపల తమ స్థా­నా­ల్లో కూ­ర్చు­న్న తర్వాత మా­త్ర­మే వారి హా­జ­రు నమో­దు అయ్యే వి­ధం­గా ఈ వ్య­వ­స్థ­ను రూ­పొం­దిం­చా­రు. ఈ కొ­త్త వి­ధా­నా­న్ని అసెం­బ్లీ స్పీ­క­ర్ ప్ర­వే­శ­పె­ట్టా­రు. ఇకపై సం­ప్ర­దా­యం­గా ఉప­యో­గి­స్తు­న్న హా­జ­రు రి­జి­స్ట­ర్ వి­ధా­నం ఉం­డ­ద­ని అసెం­బ్లీ సె­క్రె­ట­రీ జన­ర­ల్ ప్ర­స­న్న కు­మా­ర్ ని­న్న వి­డు­దల చే­సిన బు­లె­టి­న్‌­లో తె­లి­పా­రు.

వైసీపీ పాలనపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

గత వై­సీ­పీ ప్ర­భు­త్వ పా­ల­నా వై­ఫ­ల్యా­ల­ను ఎం­డ­గ­డు­తూ గవ­ర్న­ర్ ప్ర­సం­గం కొ­న­సా­గిం­చా­రు. 2019 తర్వాత రా­ష్ట్రం­లో వ్య­వ­స్థా­గ­త­మైన వై­ఫ­ల్యా­లు తలె­త్తా­య­ని, ఆ కా­లం­లో వ్య­వ­స్థ­లు పూ­ర్తి­గా వి­ధ్వం­స­మై ఆర్థిక ఒత్తి­డి పె­రి­గిం­ద­ని చె­ప్పా­రు. ప్ర­స్తుత ప్ర­భు­త్వం 19 నె­ల­లు­గా ఆ వి­చ్ఛి­న్న­మైన వ్య­వ­స్థ­ల­ను పు­న­రు­ద్ధ­రి­స్తోం­ద­ని పే­ర్కొ­న్నా­రు. సూ­ప­ర్-6 వంటి పథ­కా­ల­తో రా­ష్ట్రా­న్ని ప్ర­గ­తి పథం­లో­కి తీ­సు­కె­ళ్తోం­ద­ని ప్ర­శం­సిం­చా­రు. తమ ప్ర­భు­త్వ పా­ల­న­లో పేదల సం­క్షే­మం కోసం ఎన్నో పథ­కా­లు అమలు చే­స్తు­న్నా­మ­న్నా­రు.

ప్రగతి పథం వైపు,....

2019 తర్వాత రా­ష్ట్రం­లో మౌ­లిక సదు­పా­యా­లు, వి­ద్యు­త్, సా­గు­నీ­టి­పా­రు­దల రం­గా­లు తీ­వ్ర తి­రో­గ­మ­నం చెం­దా­య­ని గవ­ర్న­ర్ అబ్దు­ల్ నజీ­ర్ అన్నా­రు. చేదు అను­భ­వా­ల­తో వి­సి­గి­వే­సా­రిన ఏపీ ప్ర­జ­లు కూ­ట­మి ప్ర­భు­త్వా­న్ని ఎన్ను­కు­న్నా­ర­ని తె­లి­పా­రు. ప్ర­స్తు­తం తమ ప్ర­భు­త్వం పు­న­రు­ద్ధ­రణ దశ నుం­చి ప్ర­గ­తి­ప­థం వైపు పయ­ని­స్తోం­ద­ని అన్నా­రు. సూ­ప­ర్-6 ఇతర సం­క్షేమ పథ­కా­ల­ను కూ­ట­మి ప్ర­భు­త్వం సమ­ర్థ­వం­తం­గా అమలు చే­స్తోం­ద­ని అన్నా­రు. ప్ర­స్తు­తం అభి­వృ­ద్ధి కా­ర్య­క­లా­పా­ల­ను పు­నః­ప్రా­రం­భిం­చ­డం­పై­నే ప్ర­ధా­నం­గా దృ­ష్టి పె­ట్టా­మ­ని గవ­ర్న­ర్ తె­లి­పా­రు. రా­ష్ట్రా­ని­కి జీ­వ­ధార అయిన పో­ల­వ­రం ప్రా­జె­క్టు­ను పూ­ర్తి చే­సేం­దు­కు వే­గం­గా పను­లు చే­స్తు­న్నా­య­ని గవ­ర్న­ర్ పే­ర్కొ­న్నా­రు. వి­ధా­నా­లు, వ్య­వ­స్థ­లు, వ్యయ ప్రా­ధా­న్య­త­ల­లో కీలక సవ­ర­ణ­లు చే­శా­మ­ని గవ­ర్న­ర్ అబ్దు­ల్ నజీ­ర్ అన్నా­రు. దీ­ర్ఘ­కా­లిక దా­ర్శ­ని­క­త­తో కూ­డిన పూ­ర్తి స్థా­యి బడ్జె­ట్‌­ను సమ­ర్పిం­చా­మ­ని తె­లి­పా­రు. 7 శ్వే­త­ప­త్రాల వి­డు­దల ద్వా­రా పా­ర­ద­ర్శ­క­త­కు పె­ద్ద­పీట వే­శా­మ­ని అన్నా­రు. సం­క్షే­మా­న్ని అభి­వృ­ద్ధి­తో సమ­తు­ల్యం చే­య­డా­ని­కి 10 సూ­త్రా­లు రూ­పొం­దిం­చా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. సం­ప­ద­ను సృ­ష్టిం­చే ప్ర­గ­తి చక్రా­న్ని ని­ర్మిం­చ­డ­మే కా­కుం­డా పది సూ­త్రాల లక్ష్యా­న్ని పె­ట్టు­కు­న్నా­మ­ని అన్నా­రు.

Tags:    

Similar News