AP: నేడే ఏపీ మంత్రివర్గం కీలక సమావేశం
కీలక అంశాలపై చర్చ... అమరావతి, పీడీఎస్ ధాన్యంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం;
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా 43వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
దృష్టంతా అమరావతిపైనే
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.. మరోవైపు.. కాకినాడ పోర్ట్‌లో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది.. ఈ తరుణంలో పీడీఎస్ రైస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా ఆసక్తి నెలకొంది.
వైసీపీ ప్లాన్‌ను తిప్పికొట్టిన టీడీపీ!
జోగి రమేశ్ రూపంలో TDPలో చిచ్చుపెట్టాలని వైసీపీ భావించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే.. జోగి వ్యవహారంలో TDPలో పెద్ద రచ్చ జరిగింది. ఈ ఇష్యూ మరింత ముదిరి పార్టీలో చీలికలు వస్తాయని వైసీపీ భావించినట్లు టాక్. కానీ, TDP అధిష్టానం మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్న తమ నేతలపై చర్యలు తీసుకోవట్లేదని సమాచారం. అలా వైసీపీ వేసిన ప్లాన్ ను TDP తిప్పికొట్టిందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.