Ap Cabinet Meeting: కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..
Ap Cabinet Meeting:;
Ap Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణపై కేబినెట్‌లో చర్చించారు. బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 15,16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా కేబినెట్ చర్చించిందని మంత్రి పేర్నినాని తెలిపారు.