అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం ఏర్పడింది. రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట.
తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు.. తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించనున్నారని తెలుస్తోంది.
మొదటిరోజు హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరుసటిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు సీఎం టూర్ స్టార్ అవుతుంది. సాయంత్రం 4.10కి సీఎం పర్యటన ముగ్గుస్తుంది.