ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జై భారత్ సత్యాగ్ర సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఆదాని అక్రమాస్తులను ప్రశ్నిస్తే బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. సభలో దేశ సమస్యలగురించి రాహూగాంధీ మాట్లాడితే రికార్డులనుంచి తొలగించారిన విమర్శించారు. ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు సమస్యలపై ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా ముస్లిం, క్రిస్టియన్ మతపెద్దలపై దాడులు జరుగుతున్నా, కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.