AP Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
AP Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.;
AP Elections (tv5news.in)
AP Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 36 పంచాయతీలు, 68 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా పంచాయతీల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇక అనంతపురం జిల్లాలోని కందికాపుల గ్రామ పంచాయతీకి కూడా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కరోనాతో సర్పంచ్ మృతిచెందడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 18 మంది సిబ్బందితో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది