AP: ఏపీలో కొత్త జిల్లాలకు నేడే తుది నోటిఫికేషన్

కొత్తగా పోలవరం, మర్కాపురం జిల్లాలు, రేపటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన

Update: 2025-12-30 03:45 GMT

ఏపీ­లో ప్ర­స్తు­తం జరు­గు­తు­న్న జి­ల్లాల పు­న­ర్ వి­భ­జ­న­లో భా­గం­గా కూ­ట­మి ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గ భే­టీ­లో కొ­త్త జి­ల్లాల ఏర్పా­టు­కు లైన్ క్లి­య­ర్ చే­సిం­ది. ఈ సం­ద­ర్భం­గా కీలక పరి­ణా­మా­లు చోటు చే­సు­కు­న్నా­యి. సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన ఈ సమా­వే­శం­లో జి­ల్లాల పు­న­ర్వి­భ­జన ప్ర­తి­పా­ద­న­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. మం­త్రి­వ­ర్గ ని­ర్ణ­యం­తో రా­ష్ట్రం­లో­ని జి­ల్లాల సం­ఖ్య 28కి పె­ర­గ­నుం­ది. దీ­ని­కి సం­బం­ధిం­చి రేపు తుది గె­జి­ట్‌ నో­టి­ఫి­కే­ష­న్‌ వి­డు­దల కా­నుం­ది. అన్న­మ­య్య జి­ల్లా­లో­ని రా­య­చో­టి­ని మద­న­ప­ల్లె కొ­త్త జి­ల్లా­కు, రా­జం­పే­ట­ను కడప జి­ల్లా­కు, రై­ల్వే కో­డూ­రు­ను తి­రు­ప­తి జి­ల్లా­కు, గూ­డూ­రు­ను తి­రు­ప­తి జి­ల్లా నుం­చి నె­ల్లూ­రు­లో కలి­పే ప్ర­తి­పా­ద­న­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. మరో­వై­పు కొ­త్త­గా 5 రె­వె­న్యూ డి­వి­జ­న్ల ఏర్పా­టు­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.

విస్తృతంగా చర్చించి అమోదం

జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి అమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతోపాటు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలవనున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతోపాటు పలుచోట్ల మార్పులు, చేర్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్‌ జారీ కానుంది. జనవరి 1 నుంచి పాలన ప్రారంభం అవుతుంది. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.

కొత్త రెవెన్యూ డివిజన్లు

1. అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా (7 మండలాలు)

2. అద్దంకి, ప్రకాశం జిల్లా (10 మండలాలు)

3. పీలేరు, అన్నమయ్య జిల్లా (8 మండలాలు)

4. మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా (5 మండలాలు)

5. బనగానపల్లి, నంద్యాల జిల్లా (5 మండలాలు)

Tags:    

Similar News