AP: నేటి నుంచే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం

నేటి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. స్త్రీశక్తి పేరుతో అమలు చేయనున్న సర్కార్... మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం;

Update: 2025-08-15 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని మహి­ళ­ల­కు నేటి నుం­చి ఉచిత బస్సు అం­దు­బా­టు­లో­కి రా­నుం­ది. స్వా­తం­త్ర్య ది­నో­త్స­వం సం­ద­ర్భం­గా ఈరో­జు నుం­చి ‘స్త్రీ శక్తి’ పే­రిట ఈ పథ­కా­న్ని ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. ఇప్ప­టి­కే దీ­ని­కి సం­బం­ధిం­చిన స్ప­ష్ట­మైన మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను వి­డు­దల చే­శా­రు. ఈ పథకం మహి­ళ­లు, బా­లి­క­లు, ట్రా­న్స్‌­జెం­డ­ర్ల­కు వర్తిం­చ­నుం­ది. ప్ర­యా­ణా­ని­కి ముం­దు సరైన గు­ర్తిం­పు కా­ర్డు చూ­పిం­చ­డం తప్ప­ని­స­రి. ప్ర­స్తు­తా­ని­కి రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 5 రకాల బస్సు­ల్లో ఉచిత ప్ర­యాణ సౌ­క­ర్యం కల్పిం­చ­ను­న్నా­రు. పల్లె వె­లు­గు, ఆల్ట్రా పల్లె వె­లు­గు, సిటీ ఆర్డి­న­రీ, మె­ట్రో ఎక్స్‌­ప్రె­స్‌, ఎక్స్‌­ప్రె­స్‌ బస్సు­ల్లో స్త్రీ­శ­క్తి పథకం ద్వా­రా ఉచిత ప్ర­యా­ణం వర్తి­స్తుం­ది. నాన్ స్టా­ప్, ఇతర రా­ష్ట్రాల మధ్య తి­రి­గే అం­త­ర్రా­ష్ట్ర బస్సు సర్వీ­సు­ల్లో ఉచిత ప్ర­యా­ణం వర్తిం­చ­దు. సప్త­గి­రి ఎక్స్ ప్రె­స్, ఆల్ట్రా డీ­ల­క్స్, సూ­ప­ర్ లగ్జ­రీ, స్టా­ర్ లై­న­ర్, ఏసీ బస్సు­ల­కు పథకం వర్తిం­చ­దు. బసు­ల్లో రద్దీ పె­ర­గ­ను­న్న దృ­ష్ట్యా స్సు­అ­వాం­ఛ­నీయ ఘట­న­లు జర­గ­కుం­డా తగు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని ప్ర­భు­త్వం ఆదే­శిం­చిం­ది. అన్ని బస్సు­ల్లో సీసీ కె­మె­రా­లు కం­డ­క్ట­ర్ల­కు బాడీ ఓర్న్‌ కె­మె­రా­లు ఏర్పా­టు చే­యా­ల­ని ఆదే­శిం­చిం­ది. బస్సు­ల్లో రద్దీ పె­ర­గ­డం వల్ల అవాం­ఛ­నీయ పరి­స్థి­తు­లు తలె­త్త­కుం­డా ఉం­డేం­దు­కు ప్ర­భు­త్వం తగిన భద్ర­తా చర్య­లు తీ­సు­కుం­టోం­ది. అన్ని బస్సు­ల్లో సీసీ కె­మె­రా­లు, కం­డ­క్ట­ర్ల­కు బాడీ కె­మె­రా­లు ఏర్పా­టు చే­యా­ల­ని సూ­చిం­చిం­ది.

ఏపీ ప్ర­భు­త్వం మహి­ళల ప్ర­యాణ ఖర్చు తగ్గిం­చ­డా­ని­కి ఎన్ని­కల హా­మీ­ని అమలు చే­యా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. మహి­ళ­ల­కు ఉచిత బస్సు పథ­కా­న్ని అమలు చే­య­డా­ని­కి రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గం ఇటీ­వల ఆమో­దం తె­ల­ప­గా.. తా­జా­గా అం­దు­కు­గా­నూ మా­ర్గ­ద­ర్శ­కా­లు సైతం జారీ అయ్యా­యి. ఈ పథకం ద్వా­రా మహి­ళ­ల­కు ప్ర­యాణ ఖర్చు­లు తగ్గిం­చ­డ­మే కాక, వా­రి­లో ఆత్మ­వి­శ్వా­సం పెం­చే­లా చర్య­లు తీ­సు­కుం­టోం­ది ప్ర­భు­త్వం. కర్ణా­టక, తమి­ళ­నా­డు, తె­లం­గాణ రా­ష్ట్రా­ల్లో అమ­ల­వు­తు­న్న ఆర్టీ­సీ వి­ధా­నా­ల­ను పరి­శీ­లిం­చిన తరు­వా­తే కూ­ట­మి సర్కా­ర్ ఆ ది­శ­గా చర్య­లు చే­ప­ట్టిం­ది. స్త్రీ శక్తి పే­రు­తో ఆగ­స్టు 15 నుం­చి మహి­ళ­ల­కు ఉచిత బస్సు ప్ర­యా­ణం అం­దు­బా­టు­లో­కి వస్తుం­ద­ని మం­త్రి నా­దెం­డ్ల చె­ప్పా­రు.అటు పల్లె వె­లు­గు, అల్ట్రా పల్లె వె­లు­గు, సిటీ ఆర్డి­న­రీ, మె­ట్రో ఎక్స్‌­ప్రె­స్, ఎక్స్‌­ప్రె­స్ బస్సు­ల్లో ఫ్రీ జర్నీ స్కీ­మ్ అమ­లౌ­తుం­ది. ఏపీ­లో ని­వా­సం ఉం­టు­న్న­ట్టు ధృ­వీ­క­రణ ఉం­టే­చా­లు, బా­లి­క­లు, మహి­ళ­లు, ట్రా­న్స్‌­జెం­డ­ర్‌­లు ఉచిత ప్ర­యా­ణం చె­య్యొ­చ్చు. అర్హు­లైన ప్ర­యా­ణి­కు­ల­కు జీరో ఫేర్ టి­కె­ట్లు ఇస్తా­రు. ఆ ఖర్చు మొ­త్తా­న్ని RTC­కి ప్ర­భు­త్వ­మే పరి­హా­రం­గా చె­ల్లి­స్తుం­ది. మహి­ళా కం­డ­క్ట­ర్ల­కు బాడీ వా­ర్న్ కె­మె­రా­లు, బస్సు­ల్లో సీసీ కె­మె­రా­లు ఏర్పా­టౌ­తా­యి. సా­ఫ్ట్‌­వే­ర్ అప్డే­ట్ చేసి, జీరో టి­కె­టిం­గ్‌­పై కం­డ­క్ట­ర్ల­కు శి­క్షణ ఇచ్చిం­ది.

Tags:    

Similar News