AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.;
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సస్పెన్షన్ తొలగిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వర్రావును ఆదేశించారు. సుప్రీం ఆదేశాలతోనే ఏబీ వెంకటేశ్వర్రావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు.
2022 ఫిబ్రవరి 8 నుంచి తిరిగి ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్టు ఆర్డర్ కాపీ విడుదల చేశారు. ఐతే.. తనను సస్పెండ్ చేసినప్పటి నుంచి సర్వీస్‌లోకి తీసుకోవాలంటున్నారు ఏబీవీ. రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీస్‌లోకి తీసుకోవాలని కోరారు. తన సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ పోరాడిన ఏబీ వెంకటేశ్వర్రావు.. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తిరిగి విధుల్లో చేరబోతున్నారు.