Kanaka Durga Temple: విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలోనాసిరకం సరుకులు..
సర్కార్ సీరియస్.. అంతర్గత విచారణకు ఆదేశం ..;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గమ్మ ఆలయంలో నాసిరకం సరుకుల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయ శాఖ యంత్రాంగం ఈ విషయంపై అంతర్గత విచారణ చేపట్టింది. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు రోజుల తనిఖీల్లో భాగంగా రూ. 15 లక్షల విలువైన నాసిరకం సరుకులను గుర్తించారు. ఈ సందర్భంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్‌లలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై ఒక నివేదిక సిద్ధం చేయనున్నారు.
FSSAI ప్రమాణాలకు దూరంగా సరుకు వస్తుంటే అధికారులు గుర్తించక పోవటంపై రిపోర్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.. అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్ లో ఎప్పటి నుంచి ఉద్యోగులు.. సిబ్బంది విధుల్లో ఉన్నారు, ఎన్నిసార్లు నాసిరికం గుర్తించారు.. వాటిని ఎన్నిసార్లు వెనక్కి పంపించారు.. ఇలా అనే విషయాలతో సమగ్ర విచారణ చేపడుతున్నారు.. ఆ దిశగా నివేదిక సిద్ధం చేస్తున్నారట.. నాసిరకం సరుకులు వస్తుంటే అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీ విభాగాల్లో ఉద్యోగులు గుర్తించకపోవడంపై సీరియస్ అయ్యింది ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల పాత్రపై నివేదిక సిద్ధం చేయనున్నారట అధికారులు.. ఇప్పటికే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తుండగా.. ఇదే సమయంలో దుర్గగుడిపై కూడా ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..