AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తీవ్ర అస్వస్థత.. ప్రత్యేక విమానంలో ఏపీ నుండి హైదరాబాద్‌కు..
AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు.;
AP Governor (tv5news.in)
AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఆయన రెండ్రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. పరీక్షలు చేస్తే స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై ఆయన్ను హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో చేర్చారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకోవాలని, దేశానికి మరింత సేవచేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు.