AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ.. సినిమా టిక్కెట్ ధరలపై..
AP High Court: సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.;
AP High Court: సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 35ను హైకోర్టు కొట్టివేసింది. టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ.. తీర్పునిచ్చింది ధర్మాసం. దీంతో నిర్మాతలు ఊరట కలిగినట్లయ్యింది.
జగన్ ప్రభుత్వం నిర్ణయం కారణంగా వకీల్‌సాబ్ సినిమా.. తీవ్రంగా దెబ్బతింది. భారీగా రావాల్సిన కలెక్షన్లు తగ్గిపోయాయి. తాజా విడుదలైన సూపర్ హిట్ మూవీ అఖండకు అదే పరిస్థితి. స్థాయికి తగ్గ కలెక్షన్లు చేయలేకపోయింది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు.. త్వరలో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలైనపుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ వంటి పెద్ద సినిమాలకు ఊరట లభించినట్లయ్యింది.